**డిసెంబ‌ర్‌ 25, 26 తేదీల్లో తిరుమల ఆలయం మూసివేత..**

తిరుమల : డిసెంబర్‌ 25, 26 తేదీల్లో శ్రీవారి ఆలయం పాక్షికంగా మూతపడనుంది. 


సూర్య గ్రహణం నేపథ్యంలో రెండు రోజుల్లో కలిపి మొత్తం 13 గంటల పాటు తిరుమల ఏడుకొండల స్వామి ఆలయం తలుపులు క్లోజ్ చేయనున్నారు.  


డిసెంబరు 26 తేదీ.. గురువారం మార్నింగ్ 8.08 గంటల నుండి ఉదయం 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుందని వేద పండితులు తెలిపారు. 


ఈ కారణంతో.. ఆలయ చారిత్రక నేపథ్యం ప్రకారం 6 గంటల ముందుగా, డిసెంబరు 25న బుధవారం రాత్రి 11 గంటలకు గుడి తలుపులు మూసి.. డిసెంబరు 26న గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం తలుపులు తెరుస్తారు. 


ఆ తర్వాత పూర్తిగా ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత  మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. 


ఈ మేరకు టీటీడీ ప్రకటనను విడుదల చేసింది.